ఎంబీబీఎస్ ఫీజుల పెంపు?

ఎంబీబీఎస్ ఫీజుల పెంపు?
  • బీ కేటగిరీ ఫీజు రూ.40 వేల వరకు పెంచే చాన్స్​
  • సీ కేటగిరీ సీటు రెండింతలు పెరిగే అవకాశం 
  • ఫీజుల పెంపు నివేదికను ప్రభుత్వానికి పంపిన ఎఫ్‌‌ఆర్‌‌‌‌సీ 
  • పెంపుపై వారం రోజుల్లోక్లారిటీ వచ్చే అవకాశం
  • ఎన్నికలు ఉన్నందున ఎన్కముందైతున్న సర్కార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంబీబీఎస్ ఫీజులు పెంచేందుకు రంగం సిద్ధమైంది. ప్రైవేటు కాలేజీల్లోని మేనేజ్‌‌మెంట్ కోటా బీ కేటగిరీ ఫీజు రూ.30 వేల నుంచి 40 వేలు, సీ కేటగిరీ సీటు రూ.60 వేల నుంచి రూ.80 వేలు పెరిగే అవకాశం ఉంది. కన్వీనర్ కోటా ఫీజులో పెంపు ఉండకపోవచ్చని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టీఎస్‌‌ఎఫ్‌‌ఆర్‌‌‌‌సీ) ప్రభుత్వానికి ఓ నివేదిక పంపింది. 

కాలేజీల్లో ఉన్న సౌలతులు, స్టాండర్డ్స్‌‌‌‌ను బట్టి ఒక్కో కాలేజీలో ఒక్కో విధంగా పెంపును సిఫార్సు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఎన్నికల సమయం కావడంతో ఫీజుల పెంపుపై సర్కార్ ఆలోచన చేస్తోందని, ఈ నేపథ్యంలో జీవో విడుదలలో జాప్యం జరుగుతోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. మొత్తంగా అన్ని కాలేజీలకు పెంచకుండా, గతేడాది తరహాలో కొన్ని కాలేజీలకే పెంపును పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌‌‌‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైనందున, వారం రోజుల్లోనే ఫీజుల పెంపుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

గతేడాది పది కాలేజీల్లో..

రాష్ట్రంలో గతేడాది నాటికి 23 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉండగా, ఇందులో 7 కాలేజీల్లోని మేనేజ్‌‌‌‌మెంట్ కోటా(బీ కేటగిరీ), ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐ కోటా( సీ కేటగిరీ) సీట్లకు ఫీజులు పెంచారు. ఈ లిస్టులో చల్మెడ ఆనందరావు ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కామినేని ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, ఎంఎన్‌‌‌‌ఆర్ మెడికల్ కాలేజ్, అపోలో ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌‌‌‌, మల్లారెడ్డి ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌‌‌‌, ఎస్‌‌‌‌వీఎస్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో రూ.11.55 లక్షలుగా ఉన్న బీ కేటగిరీ సీటు ఫీజును రూ.13 లక్షలకు, సీ కేటగిరీ ఫీజును రూ.23 లక్షల నుంచి రూ.26 లక్షలకు పెంచారు. గతేడాదే పెంచినందున ఈ ఏడు కాలేజీల్లో పెంపు ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. అన్ని రకాల ఖర్చులు పెరిగినందున తమ కాలేజీల్లోనూ ఫీజులు పెంచాలని మిగిలిన కాలేజీలు కూడా టీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఆర్సీని ఆశ్రయించాయి. కానీ, కాలేజీల్లో ఉన్న సౌలతులు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయా కాలేజీల్లో ఫీజుల పెంపునకు గతేడాది సర్కార్ ఒప్పుకోలేదు. దీంతో ఈ ఏడాది మరోసారి టీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌సీని ఆయా కాలేజీల మేనేజ్‌‌‌‌మెంట్లు ఆశ్రయించాయి. ప్రస్తుతం ఈ కాలేజీల్లో బీ కేటగిరీ సీటు ఫీజు రూ.11.55 లక్షలుగా, సీ కేటగిరీ రూ.23 లక్షలుగా ఉంది. బీ కేటగిరీ ఫీజు లక్షన్నర, సీ కేటగిరీ ఫీజు రూ.3 లక్షలు పెంచాలని కాలేజీలు కోరాయి. కానీ, రూ.30 వేల నుంచి రూ.80 వేల మేర పెంపునకే ఎఫ్‌‌‌‌ఆర్సీ సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఎన్నికలు ఉన్నందున ఈ పెంపులో కోత పెట్టడం లేదా పెంపును కొన్ని కాలేజీలకే పరిమితం చేయడం వంటి అంశాలను ప్రభుత్వం 

పరిశీలిస్తోంది.

లక్షల్లో భారం...
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని పూర్తి సీట్లను, ప్రైవేట్‌‌‌‌ మెడికల్ కాలేజీల్లోని సగం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తున్నారు. ఈ కోటా ఫీజు రూ.60 వేలుగా ఉంది. ప్రైవేట్‌‌‌‌లో మిగిలిన సగం సీట్లలో 35 శాతం సీట్లను బీ కేటగిరీలో, 15 శాతం సీట్లను సీ కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు. బీ కేటగిరీ సీట్లలో 85 శాతం సీట్లను తెలంగాణ స్టూడెంట్లకు రిజర్వ్‌‌‌‌ చేస్తూ గతేడాదే సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఫీజులను కూడా గతేడాది నుంచే పెంచుతోంది. ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌సీ సూచించినట్టుగా బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.30 వేలు పెంచితే, ఒక్కో స్టూడెంట్‌‌‌‌పై మొత్తం కోర్సుకు రూ.1.35 లక్షల(నాలుగున్నర ఏండ్లు) వరకు భారం పడుతుంది. సీ కేటగిరీ సీటు తీసుకున్న స్టూడెంట్‌‌‌‌పై రూ.2.7 లక్షల వరకు భారం పడనుంది.