రైలు, ఫ్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుపోయిన యువతి

రైలు, ఫ్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుపోయిన యువతి

విశాఖపట్టణంలోని దువ్వాడ రైల్వేస్టేషన్ లో శశికళ అనే విద్యార్థిని ప్రమాదవశాత్తు రైలు, ఫ్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుపోయింది. స్టేషన్‭లో ఆగి ఉన్న రైలు నుంచి కిందికి దిగుతుండగా ఈ ఘటన జరిగింది. భాదితురాలి అరుపులు విని.. రైల్వే సిబ్బంది రైలును స్టేషన్ లోనే నిలిపివేశారు. ఆమెను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. గంటన్నరపాటు నరకయాతన అనుభవించిన ఆమె చివరికి ప్రాణాలతో బయటపడింది. ఫ్లాట్ ఫామ్ ను పగులగొట్టి యువతి ప్రాణాలను కాపాడారు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

అన్నవరానికి చెందిన శశికళ దువ్వాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఉదయం కాలేజీకి వెళ్లేందుకు గుంటూరు, రాయఘడ్ ప్యాసింజర్ ఎక్కిన ఆమె.. దువ్వాడ రైల్వే స్టేషన్ లో దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.