ఢిల్లీలో 34 కోచింగ్ సెంటర్లపై సీలింగ్ చర్యలు

ఢిల్లీలో 34 కోచింగ్ సెంటర్లపై సీలింగ్ చర్యలు

న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై కొరడా ఝుళిపించింది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్.. ఢిల్లీలో అక్రమంగా నిర్వహిస్తున్న 34 కోచింగ్ సెంటర్ల బేస్ మెంట్లను సీల్ చేసింది. వెస్ట్ జోన్ లో 23, సెంట్రల్ జోన్ 8, నజప్ గఢ్ జోన్ లో 3 కోచింగ్ సెంటర్లలోని బేస్ మెంట్లలోసీలింగ్ చర్యలు చేపట్టారు. సెంట్రల్ జోన్ లో 14 కోచింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేశారు. అందులో 6 స్థలాలను ఖాళీ చేయగా.. 8 కోచింగ్ సెంటర్లకు సీల్ వేశారు. 

ఇటీవల ఢిల్లీలో కురిసిన వర్షాలకు అపార్టుమెంట్ బేస్ మెంట్ లో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్ లో ముగ్గురు ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్నఅభ్యర్థులు చనిపోవడంతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కఠిన చర్యలు చేపట్టింది అందులో భాగంగా అక్రమంగా బేస్ మెంట్లలో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లను సీల్ చేసినట్లు ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ చెప్పారు. 

ఢిల్లీలో చాలా కోచింగ్ సెంటర్లు అక్రమంగా బేస్ మెంట్లలో నిర్వహిస్తున్నారు. ఈ కోచింగ్ సెంటర్లు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. అటువంటి ఇనిస్టిట్యూట్ లపై చర్యలు తీసుకుంటున్నామని షెల్లీ ఒబెరాయ్ అన్నారు.