టెన్త్ తర్వాత ఐటీఐ చేశారా..? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడ్డయ్..

టెన్త్ తర్వాత ఐటీఐ చేశారా..? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడ్డయ్..

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మినరల్స్ ఎక్స్​ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ(ఎంఈసీఎల్) నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 05.

  • పోస్టుల సంఖ్య: 108
  • పోస్టులు: అకౌంటెంట్ 06, హిందీ ట్రాన్స్​లేటర్ 01, టెక్నీషియన్(సర్వే అండ్ డ్రాఫ్ట్స్​మెన్) 15, టెక్నీషియన్(శాంపిలింగ్) 02, టెక్నీషియన్(ల్యాబొరేటరీ) 03, అసిస్టెంట్(మెటీరియల్స్) 16, అసిస్టెంట్(అకౌంటెంట్స్) 10, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్​) 04, అసిస్టెంట్(హిందీ) 01, ఎలక్ట్రీషియన్ 01, మెషినిస్ట్ 05, టెక్నీషియన్(డ్రిల్లింగ్) 12, మెకానిక్ 01, మెకానికమ్–ఆపరేటర్(డ్రిల్లింగ్) 25, జూనియర్ డ్రైవర్ 06.
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి పదో తరగతి లేదా సమాన అర్హతతోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, ఏదైనా డిగ్రీ, బీకాం లేదా గణితంలో డిగ్రీ, బీఎస్సీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జియోలజీలో బీఎస్సీ, హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్ డిగ్రీతోపాటు సీఏ లేదా ఐసీడబ్ల్యూఏలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.  
  • వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • లాస్ట్ డేట్:  జులై 05.
  • అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్  అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్/ డిపార్ట్​మెంట్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 
  • సెలెక్షన్ ప్రాసెస్: వేర్వేరు పోస్టులను అనుసరించి రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు www.mecl.co.in వెబ్​సైట్లో సంప్రదించగలరు.

►ALSO READ | డీఎంహెచ్ఓ హైదరాబాద్లో మెడికల్ ఆఫీసర్ జాబ్స్.. జీతం రూ.52 వేల నుంచి లక్షా 30 వేలు..