పోలింగ్ మెటీరియల్ను సక్రమంగా అందించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

పోలింగ్ మెటీరియల్ను సక్రమంగా అందించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
  •     మెదక్​ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాహుల్​ రాజ్​

మెదక్​ టౌన్, వెలుగు: జిల్లాలో పోలింగ్​ విధులు నిర్వహించే సిబ్బందికి మెటీరియల్​ను సక్రమంగా అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాహుల్​ రాజ్​ సూచించారు. ఆదివారం హవేలీ ఘనపూర్​ మండల కేంద్రంలోని పోస్టల్ బ్యాలెట్, పోలింగ్ మెటీరియల్​ను ఆయన పరిశీలించారు. మండల కేంద్రంలోని ప్రైవేట్​ ఫంక్షన్​ హాల్​లో డిస్ట్రిబ్యూషన్​ సెంటర్​, ఎంపీడీవో ఆఫీసును పరిశీలించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. 

అనంతరం మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి  పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మండలంలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించామన్నారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రేయాంత్​, అధికారులు శ్రీకాంత్​, సిబ్బంది  ఉన్నారు. 

వాహనాల తనిఖీలు ముమ్మరం

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మెదక్​ పట్టణంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కలెక్టర్​ రాహుల్​ రాజ్​ ఆధ్వర్యంలో వాహన తనిఖీ వీడియోలు తీశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల కోడ్​ అమలులో ఉన్నందున నిబంధనల ప్రకారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హవేలీ ఘనపూర్ మండల పరిధిలో కూడా ​ ఎస్ఐ నరేశ్ ఆధ్వర్యంలో ​పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు.