అథ్లెటిక్స్ పోటీల్లో సత్తాచాటిన మెదక్ జిల్లా క్రీడాకారులు

అథ్లెటిక్స్ పోటీల్లో సత్తాచాటిన మెదక్ జిల్లా క్రీడాకారులు

మెదక్​ టౌన్​, వెలుగు : తెలంగాణ 11వ స్టేట్ క్రాస్ కంట్రీ ఛాంపియన్​షిప్ పోటీల్లో మెదక్ జిల్లా క్రీడాకారులు సత్తాచాటారని జిల్లా అథ్లెటిక్స్​ అసోసియేషన్ కార్యదర్శి మధుసూదన్, కోచ్​అర్జున్​తెలిపారు. హైదరాబాద్​గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో శుక్రవారం రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఇందులో అండర్ –20 గర్ల్స్ 8 కిలోమీటర్ల విభాగంలో మెదక్ జిల్లా ఛాంపియన్​షిప్​గా నిలిచింది. 

ఈ సందర్భంగా వారికి తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర్ రెడ్డి ట్రోఫీని అందజేశారు. అండర్ –20 గర్ల్స్ 8 కిలోమీటర్ల విభాగంలో మెదక్​ టీజీ టీడబ్ల్యూఆర్​డీ కాలేజీకి చెందిన బానోత్​అనిత ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈనెల 24న ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో మెదక్ జిల్లా తరఫున వారు పాల్గొంటారని తెలిపారు.