సంగారెడ్డి టౌన్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఇండస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న కాక వెంకటస్వామి ఇంటర్ డిస్టిక్ పోటీల్లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ కం నాక్ అవుట్ పోటీల్లో బుధవారం రెండు విడతల్లో మ్యాచ్ నిర్వహించారు.
మొదట మ్యాచ్లో సిద్దిపేట సంగారెడ్డి జట్లు తలపడగా మొదట బ్యాటింగ్ చేసిన సిద్దిపేట జట్టు 18.2 ఓవర్లలో 21 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది .అనంతరం బ్యాటింగ్ చేసిన సంగారెడ్డి జిల్లా జట్టు 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సంగారెడ్డి జట్టుకు చెందిన శ్రీధర్ 2 వికెట్లు తీయడంతో పాటు 34 పరుగులు చేయడంతో మాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
సెకండ్ సెషన్లో నిర్వహించిన సిద్దిపేట మెదక్ టీ20 మ్యాచ్లో సిద్దిపేట జట్టు 180 పరుగులు చేసి అలౌట్ కాగా మెదక్ జిల్లా జట్టు 17. 2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో మెదక్ జిల్లా జట్టు ఫైనల్ లో ప్రవేశించింది. ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసి 24 పరుగులు చేసిన రెహమత్ మాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈనెల 26న సంగారెడ్డి మెదక్ జిల్లా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
