- కొత్తగూడెం బస్టాండ్లో భక్తులకు ఇబ్బందులు
- బస్సులో మేకకు టికెట్రూ.350
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జాతరకు పోదాం.. పదా అంటూ భక్తులు పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా మేడారానికి బయల్దేరుతున్నారు. బుధ, గురు, శుక్రవారాల్లో మేడారంలో సమ్మక్క–సారాలమ్మ జాతర జరగనుంది. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి దాదాపు 2 లక్షలకు పైగా భక్తులు మేడారానికి వెళ్లారు. ఈసారి 2.50 లక్షల మంది రాకపోకలు సాగిస్తారని ఆర్టీసీ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించి దాదాపు 240 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.
మంగళవారం నుంచే జిల్లా నుంచి భక్తులు మేడారానికి పయనమయ్యారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నుంచి 110 బస్సులను ఆర్టీసీ నడుపుతున్నారు. సరైన సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ ఆఫీసర్లు విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. బస్టాండ్ ఆవరణలో వేసిన టెంట్లో సగం ఆఫీసర్లే వాడుకుంటున్నారని భక్తులు పేర్కొంటున్నారు. ఎండలు మొదలు కావడంతో టెంట్లు, కూర్చీలు కూడా ఎక్కువగా వేయాలని భక్తులు కోరుతున్నారు.
బెల్లానికి డిమాండ్...
మేడారం జాతర నేపథ్యంలో బెల్లానికి డిమాండ్ పెరిగింది. మరోవైపు మేడారం జాతరకు భక్తులు తమ వెంట మేకలను తీసుకెళ్తే బస్సులో ఒక్కో మేకకు రూ.350 చొప్పున టికెట్ కొడ్తున్నారు. టికెట్పేరుతో భారీగా వసూళ్లు చేయడంతో ఆర్టీసీ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
