ములుగు, వెలుగు : మేడారం మహాజాతరలో ఫోన్లు కలవకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జాతరలో ప్రాంగణంలో వివిధ నెట్‌వర్క్ సంస్థలు సుమారు 40 టవర్లను ఏర్పాటు చేశాయి. కానీ సిగ్నల్ ఉన్నట్లు చూపిస్తున్నా.. ఫోన్లు మాత్రం కలవడం లేదు. కాల్స్ చేయడానికి, నెట్ సేవల కోసం భక్తులు ఎత్తైన భవనాల పైకి ఎక్కుతున్నారు.
టవర్ల పరిధిలో పరిమితికి మించి భక్తులు ఉండడంతో ఇలాంటి సమస్య ఎదురవుతుందంటూ ఆయా నెట్‌వర్క్ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఫోన్లు కలవకపోవడంతో భక్తులు తమ బంధువులు, కుటుంబసభ్యులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫోన్లు పనిచేయకపోవడంతో చాలా మంది.. మిస్సింగ్ కేంద్రాలకు వెళ్లి తమ బంధువుల పేర్లను అనౌన్స్ చేయిస్తున్నారు.
