మేడారం పూజలు: ఆదివాసీ సంప్రదాయాలు... పూజల్లో మార్పు లేదు

మేడారం పూజలు: ఆదివాసీ సంప్రదాయాలు... పూజల్లో మార్పు లేదు

 మేడారంలో ఆదివాసీ పూజలు, సంప్రదాయాల్లో ఎలాంటి మార్పు లేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మేడారంలోని మీడియా సెంటర్‌‌లో బుధవారం జర్నలిస్టులకు ఆమె టీషర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గద్దెల విస్తరణ కారణంగా ఒకేసారి ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకునే అవకాశం ఉందన్నారు. తల్లులు గద్దెలకు చేరడం, తిరిగి వనప్రవేశం చేయడం వంటి కార్యక్రమాల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. నాలుగు రోజుల జాతర.. 40 రోజుల ముందు నుంచే జరుగుతోందన్నారు. ప్రచారంలో మీడియా పాత్ర కీలకమైందని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.