
మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: ‘మీకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా?.. ఫుడ్ టేస్టీగా ఉంటుందా?.. ఏమైనా సమస్య ఉంటే చెప్పండి’ అని మేడ్చల్ మల్కాజిగిరి అడిషనల్ కలెక్టర్ రాధికగుప్తా విద్యార్థులను అడిగారు. బుధవారం ఆమె శామీర్ పేట మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీని విజిట్ చేశారు. పిల్లలతో మాట్లాడి వారికి పెడుతున్న భోజనంపై ఆరా తీశారు.
స్టోర్ రూంలో వంట సామగ్రిని పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యంపై కేర్ తీసుకోవాలని, పరసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం శామీర్ పేట్ జడ్పీ హైస్కూల్, ప్రైమరీ పాఠశాలను సందర్శించారు. డీఈవో విజయకుమారి, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఝాన్సీరాణి, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ వినోద్ కుమార్ ఉన్నారు.