- జీనోమ్ వ్యాలీలో బయోటెక్ ఫార్మా కంపెనీల పరిశీలన
శామీర్ పేట, వెలుగు: ప్రజల ఆరోగ్యం, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపని సురక్షిత మెడిసిన్ నే తయారు చేయాలని మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ సూచించారు. మంగళవారం శామీర్ పేట మండలం తుర్కపల్లి పరిధిలోని జీనోమ్ వ్యాలీ బయోటెక్ ఫార్మా కంపెనీలను కలెక్టర్ సందర్శించారు. భారత్ బయోటెక్, బయోలాజికల్ఈ లిమిటెడ్ ఫార్మా కంపెనీల్లో మెడిసిన్ తయారీ తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మెడిసిన్ తయారీలో క్రమబద్ధమైన పద్ధతిలో పరిశోధనలు చేస్తూ నాణ్యతా పరమైన ప్రమాణాలను పాటించాలని పేర్కొన్నారు. బయోటెక్ ఫార్మా కంపెనీలు డ్రగ్స్ ను శుభ్రపరచడం స్టెరిలైజేషన్, నాన్ స్టెరిలైజేషన్, కాలుష్య నివారణకు తగు చర్యలను బాధ్యతగా చేపట్టాలని సూచించారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్(డీఐసీ) ప్రశాంత్ కుమార్, చంద్రశేఖర్ బాబు, డిప్యూటీ డైరెక్టర్ వెంకట శేఖర్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారులు సాయికృష్ణ, జోనల్ మేనేజర్లు అనురాధ వినయ్ కుమార్, బయోటెక్ కంపెనీల ప్రతినిధులు ఉన్నారు.
