ఘట్ కేసర్లో చిన్నారి కిడ్నాప్...కిరాణా షాప్కు వెళ్లి తిరిగిరాలేదు

ఘట్ కేసర్లో చిన్నారి కిడ్నాప్...కిరాణా షాప్కు వెళ్లి తిరిగిరాలేదు

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్లో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది.  నాలుగేళ్ల కృష్ణవేణిని  దుండగులు కిడ్నాప్ చేశారు. జులై 05వ తేదీ బుధవారం కిరాణ దుకాణానికి వెళ్లిన పాప ఇంటికి తిరిగిరాలేదు.  కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో అలర్ట్ అయిన పోలీసులు డాగ్ స్క్వాడ్, సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా తనిఖీలు చేస్తున్నారు. మతిస్థిమితం లేని ఓ వ్యక్తిపై కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. 

రాజేశ్వరి,భరత్ దంపతులు ఘట్కేసర్ EWS కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి పాప కృష్ణవేణి(4). పాప తండ్రి భరత్ వృత్తిరీత్యా పెయింటర్ గా పనిచేస్తున్నాడు. జులై 05వ తేదీ రాత్రి 8 గంటలకు కిరణా షాప్ లోకి వెళ్లిన చిన్నారిని దుండగుడు ఎత్తుకుపోయాడు. చిన్నారి  కృష్ణవేణి మిస్సింగ్ పై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలో సురేష్ అనే మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి వద్ద పాప ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.