ఇవాళ రాష్ట్రంలో 189 మందికి కరోనా పాజిటివ్

ఇవాళ రాష్ట్రంలో 189 మందికి కరోనా పాజిటివ్

హైదరాబాద్: కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో హెల్త్ బులెటిన్లు నిలిపేసిన వైద్య ఆరోగ్యశాఖ కోర్టు ఆదేశాలతో స్పందించింది. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దని హైకోర్టు హెచ్చరించిన నేపధ్యంలో వైద్య ఆరోగ్యశాఖ వెంటనే స్పందించి మీడియా బులిటెన్ యధాతథంగా విడుదల చేస్తామని ప్రకటించింది. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పరీక్షా కేంద్రాల్లో నిర్ధారించిన కరోనా కేసుల వివరాలతో బులెటిన్ ప్రకటించింది. ఇవాళ రాష్ట్రంలో తాజాగా 189మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు  2 లక్షల 98 వేల 453 కి చేరినట్లు వివరించింది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో  129 మంది కొలుకోగా .. ఇప్పటి వరకు 2 లక్షల 94 వేల 911 మంది కోలుకున్నారని, గడచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందడంతో కరోనా మృతుల సంఖ్య 1632 కి చేరిందని బులెటిన్ లో ప్రకటించారు. ఇవాళ్టి వరకు నమోదైన  1910 యాక్టీవ్ కేసులలో 818 మంది ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మీడియా బులెటిన్ లో వివరించింది.

ఇవి కూడా చదవండి

మనిషి చావుకు కారణమైన కోడిపై కేసు

కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటును కుదిపేసే పెద్ద తప్పు చేశాడు..

కాంట్రాక్ట్ ఉద్యోగులను.. రెగ్యూలర్ చేస్తే.. కొత్తగా భర్తీ చేసినట్లా?