మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణ (ఎంహెచ్ఎస్ఆర్బీ, తెలంగాణ) సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్స్, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబర్ 23.
పోస్టుల సంఖ్య: 1623.
పోస్టులు: సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్స్ 1616, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ 07.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, డీఎన్బీ, ఎంఎస్/ ఎండీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 46 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 08.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 23.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, బీఈ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్, ప్రభుత్వ సేవల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత పరీక్షలో (పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా/ డీఎన్బీ) పొందిన మార్కుల శాతానికి గరిష్టంగా 80 పాయింట్లు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటళ్లు/ సంస్థలు/ కార్యక్రమాల్లో కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన సేవలకు గరిష్టంగా 20 పాయింట్లు కేటాయించారు.
పూర్తి వివరాలకు mhsrb.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
