
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థి అనుమాస్పద స్థితిలో మృతి చెందటం కలకలం రేపింది. అనస్థీషియా విభాగానికి చెందిన విద్యార్థి నితిన్ గా గుర్తించారు. శుక్రవారం (అక్టోబర్ 17) ఆపరేషన్ థియేటర్ లో విగతజీవిగా పడి ఉండటం చూసి తోటి విద్యార్థులు పోలీసులు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నితిన్ గురువారం (అక్టోబర్ 16) విధులకు హాజరైనట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. శుక్రవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.