V6 News

మహేశ్వరం మెడికల్ కాలేజీలో రెండో రోజు మెడికల్ స్టూడెంట్ల ధర్నా

మహేశ్వరం మెడికల్ కాలేజీలో   రెండో రోజు మెడికల్ స్టూడెంట్ల ధర్నా

ఇబ్రహీంపట్నం, వెలుగు: తమకు కనీస వసతులు కల్పించాలంటూ మహేశ్వరం మెడికల్ కాలేజీ రెండో రోజు మంగళవారం ఆందోళన చేశారు. హాస్టల్ వసతి, ల్యాబ్స్ లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్​ చేశారు. వీరికి మెడికో స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు సంఘీభావం తెలిపారు. మెడికల్ కాలేజీని డైరెక్టరేట్​ అఫ్​ మెడికల్​ ఎడ్యుకేషన్​ ఆఫీసర్​ శివరామప్రసాద్  అక్కడికి చేరుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.