కరీంనగర్ టౌన్, వెలుగు: ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటిసారి కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ లో అత్యాధునిక ఎండోస్కోపిక్ వెన్నెముక సర్జరీని అందుబాటులోకి తసుకువచ్చామని న్యూరోసర్జన్ రాజీవ్ రెడ్డి తెలిపారు. ఇందులో కీ హోల్ తో తక్కువ సమయంలో ఖచ్చితత్వంతో సర్జరీ పూర్తవుతుందన్నారు. శనివారం దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్హెడ్ గుర్రం కిరణ్తో కలిసి ఆయన మాట్లాడారు.
వెన్నెముక సర్జరీ కోసం భయపడాల్సిన అవసరం లేదని, బాధిత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నడుమునొప్పి వచ్చిన ప్రారంభంలోనే స్పైన్ సర్జరీ చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. రెండ్రోజుల్లోనే పేషెంట్ రికవరీ ఉంటుందని, అన్ని పనులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ సర్జరీతో మజిల్ డ్యామేజ్, బోన్ రిమూవల్ చాలా తక్కువని పేర్కొన్నారు. డాక్టర్లు వినయ్, సత్యనారాయణ, పల్లవి, ప్రియాంక, మార్కెటింగ్ కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.
