మేడిగడ్డ ఏడో బ్లాక్ ను పరిశీలించిన సీడబ్ల్యూపీఆర్ఎస్‌ టీం

మేడిగడ్డ  ఏడో బ్లాక్ ను పరిశీలించిన  సీడబ్ల్యూపీఆర్ఎస్‌ టీం

జయశంకర్ భూపాలపల్లి  జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని  మేడిగడ్డ  లక్ష్మీ బ్యారేజీని  సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్  నిపుణుల బృందం పరిశీలించింది. బ్యారేజ్  ఏడో బ్లాక్ లో దెబ్బతిని, కుంగిన  పిల్లర్లను  సిడబ్ల్యూపిఆర్ ఎస్  నిపుణులు  క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  ఇంజనీరింగ్  అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు ముగ్గురు టెక్నికల్ నిపుణులు. బ్యారేజ్ ఏడో బ్లాక్ లోని  కుంగిన 15 నుండి 21 వ పిల్లర్   గేట్ల వద్ద  ఇసుక మేటలను పరిశీలించారు.