
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై కేసు నమోదు చేశారు మేడిపల్లి పోలీసులు. ముందుగా కవిత ప్రోద్బలంతోనే ఆమె అనుచరులు, కార్యకర్తలు తన కార్యాలయంపై, తనపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు తీన్మార్ మల్లన్న. సుమారు 50 మంది కవిత అనుచరులు మారణాయుధాలతో తనపై దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించారని మల్లన్న ఫిర్యాదు చేశారు. బీసీ ఉద్యమ నాయకులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు కవితపై బీఎన్ఎస్ సెక్షన్లు 191(2), 191(3), 333,109, 324(4), 351(3), 132, 190, 49 ప్రకారం కేసులు నమోదు చేశారు.
మరో వైపు మరోవైపు తీన్మార్ మల్లన్న అనుచరులు, భద్రతా సిబ్బంది తమపై కత్తులు, తుపాకులతో దాడి చేశారంటూ జాగృతి కార్యకర్త లింగమయ్య అలియాస్ అశోక్ యాదవ్ ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్న, అతని అనుచరులపై 191(2), 191(3), 76, 127(2), 109, 351(3),రె/విత్ 149 ఐపీసీ సెక్షన్ 25, 27 యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.
ALSO READ : అమెరికాలో ఏడుగురు ఖలిస్తానీ టెర్రరిస్టులు అరెస్ట్
కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై జులై 13న జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్ లోని ఉప్పల్ మేడిపల్లిలో ఉన్న తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి చేశారు జాగృతి కార్యకర్తలు.ఆఫీసులో సిబ్బందిపై దాడి చేసిన జాగృతి కార్యకర్తలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మల్లన్న గన్ మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.