
వాషింగ్టన్: ఇండియా మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ టెర్రరిస్టులను అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) అరెస్ట్ చేసింది. ఇందులో ఏడుగురు ఖలిస్తానీ టెర్రరిస్టులు కాగా, మరొకరు పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ పవిట్టర్ సింగ్ బటలా ఉన్నారు. ఇతను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. కిడ్నాప్ కేసుకు సంబంధించి వీరిని ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుంది. పవిట్టర్ సింగ్ బటాలా నిషేధిత బాబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) టెర్రర్ సంస్థకు చెందిన వాడు. ఈ సంస్థ నుంచి ఇండియాలో పలు ఉగ్ర కార్యకలాపాల్లో అతను పాల్గొన్నాడు.
శాన్ జోక్విన్ కౌంటీలో కిడ్నాప్, హింసకు సంబంధించి కేసులో వీరందరిని శుక్రవారం అమెరికాలోని పలు ప్రాంతాల్లో అరెస్ట్ చేసినట్లు ఎఫ్‌బీఐ అధికారులు వెల్లడించారు. మొతం ఐదు స్వాట్ (ఎస్‌డబ్ల్యూఏటీ) టీమ్‌లు వీరిని అరెస్ట్ చేశాయని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో పవిట్టర్ సింగ్ బటలా, దిల్‌ప్రీత్‌సింగ్, అమ్రిత్ పాల్ సింగ్, అర్ష్‌ప్రీత్ సింగ్, మన్‌ప్రీత్ రంధావా, సరబ్‌జిత్ సింగ్, గుర్తాజ్ సింగ్, విశాల్ ఉన్నారు.
వీరిపై కిడ్నాపింగ్, టార్చర్, బెదిరింపు తదితర కేసులు నమోదు చేశారు. వీరి దగ్గరి నుంచి అక్రమంగా ఉన్న ఆరు గన్స్‌ను, బుల్లెట్ మ్యాగ్జీన్స్, పేలుడు పదార్థాలతో పాటు 15 వేల డాలర్ల క్యాష్‌ను స్వాధీనం చేసుకున్నారు. అమెరికా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న ముఠాను లక్ష్యంగా చేసుకొని దేశ్యాప్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ చేపట్టామని ఎఫ్‌బీఐ అధికారులు వెల్లడించారు.