కాంగ్రెస్ బలోపేతానికి ఐఎన్టీయూసీ కృషి: ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ 

కాంగ్రెస్ బలోపేతానికి ఐఎన్టీయూసీ కృషి: ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ 
  • జలమండలి ఎన్నికల్లో గెలిచిన రాజిరెడ్డికి అభినందన

నారాయణగూడ, వెలుగు: దేశవ్యాప్తంగా కాంగ్రెస్​బలోపేతానికి ఐఎన్‌‌‌‌టీయూసీ కృషి చేస్తోందని, ఐఎన్‌‌‌‌టీయూసీ బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని ఏఐసీసీ రాష్ట్ర ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. ఇటీవల తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా విజయం సాధించిన ఐఎన్‌‌‌‌టీయూసీ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డిని మంగళవారం హైదర్ గూడ ఓల్డ్ ఎమ్యెల్యే క్వార్టర్స్ లో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను, గౌరవాన్ని రక్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ దూరదృష్టితో చేపట్టిన కార్యక్రమం శ్రమిక్ న్యాయ్ అని తెలిపారు. 

ఇందులో భాగంగానే సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులను ఏకం చేసి, కనీస వేతనాలు, ఉద్యోగ, ఆరోగ్య భద్రతకై ఉద్యమాలు చేయాలని సూచించారు. రాజిరెడ్డి మాట్లాడుతూ.. జలమండలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తన విజయానికి సహకరించిన ఉద్యోగులు, కార్మికుల హక్కుల రక్షణ, సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. 

కార్యక్రమంలో ఐఎన్‌‌‌‌టీయూసీ తరఫున జలమండలి ఎన్నికల ఇన్‌‌‌‌చార్జిగా వ్యవహరించిన మాజీ మేయర్  బొంతు రామ్మోహన్, ఐఎన్‌‌‌‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.డి.చంద్రశేఖర్, టీజేఈయూ ప్రధాన కార్యదర్శి టి.పి.రాఘవేంద్ర రాజ్, అసోసియేట్ ప్రెసిడెంట్ అల్లి శ్రవణ్​కుమార్, మేవ ప్రధాన కార్యదర్శి సయ్యిద్  అక్తర్ అలీ, నాయకులు పాల్గొన్నారు.