డీసీసీలు మూడు నెలల్లో పనితనం నిరూపించుకోవాలె..లేదంటే స్వయంగా తప్పుకోవాలె:మీనాక్షి నటరాజన్

డీసీసీలు మూడు నెలల్లో పనితనం నిరూపించుకోవాలె..లేదంటే స్వయంగా తప్పుకోవాలె:మీనాక్షి నటరాజన్

హైదరాబాద్: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2029లో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే లక్ష్యంగా డీసీసీ చీఫ్ లు పనిచేయాలని సూచించారు. మూడు నెలల్లో పనితీరు నిరూపించుకోవాలని అన్నారు. లేని పక్షంలో వాళ్లే పదవి నుంచి తప్పుకోవాలని సూచించారు. తప్పుకోనివాళ్లను పార్టీయే తప్పించి వారి స్థానంలో వేరే వారిని నియమిస్తుందని అన్నారు. గుజరాత్ లో ఇదే జరిగిందని, తెలంగాణాలోనూ అదే జరుగుతుందని. అన్నారు. మూడు నెలలు కాకుంటే ఆరు నెలల వరకు అవకాశం ఇస్తామని, కొత్త డీసీసీ చీఫ్ ల పనితీరు బాగా లేకుంటే తప్పించి వేరే వారిని నియమిస్తామని అన్నారు.

పారం పది రోజుల్లో కార్పొరేషన్ పదవుల భర్తీ: పీసీసీ చీఫ్

వారం పది రోజుల్లో కార్పొరేషన్ చైర్మన్ స్థానాలతోపాటు పెండింగ్ లో ఉన్న పదవులనూ భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.ఇవాళ గాంధీభవన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం జిల్లాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు. డీసీసీ పదవి కీలకమైందని, తనకు ఆ అవకాశం రాలేదని అన్నారు. నిష్ణాతులైన ఏఐపీసీ అబ్జర్వర్స్ తో డీసీసీల ఎంపిక జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి లక్షా 80 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. కేసీఆర్ తన పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. కేసీఆర్ శకం ముగిసిందని, ఆయన ఇంట్లో ఆస్తుల పంచాది మొదలైందని అన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళలు, పేదల సెంట్రిక్ గా పాలన అందిస్తోందని చెప్పారు.

►ALSO READ | పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో మరో పిటిషన్