అనంతగిరిలో మీనాక్షి నటరాజన్ పర్యటన..డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ఏర్పాట్ల పరిశీలన

అనంతగిరిలో మీనాక్షి నటరాజన్ పర్యటన..డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ఏర్పాట్ల పరిశీలన

వికారాబాద్​, వెలుగు: ఏపీ, తెలంగాణలోని కాంగ్రెస్ జిల్లా (డీసీసీ) అధ్యక్షుల శిక్షణా తరగతులు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హరిత రిసార్ట్​లో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో అనంతగిరిలో ఏఐసీసీ తెలంగాణ ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ శనివారం పర్యటించారు. 

శిక్షణా తరగతుల వసతులు, ఏర్పాట్లను పీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి, జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోలుకుంద సంతోష్, మండల పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.