ఇటీవల ఫోర్బ్స్ బిలియనీర్ 2024 జాబితా విడుదలైంది. ఇందులో బ్రెజిలియన్ విద్యార్తి లివియా వోయిగ్ట్ ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సు గల బిలియనీర్ గా రికార్డు సొంతం చేసుకుంది. లివియా కేవతం 19 సంవత్సరాల వయసులో 1.1 బిలియన్ డాలర్ల నికర సంపదను కలిగి ఉంది. ఆమె ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలుగా పేరు సంపాదించింది. లివియా వొయిగ్ట్ గురించి చెప్పాలంటే.. ఆమె బ్రెజిల్ లోని ఓ యూనివర్సిటీ లో చదువుతోంది.
లిలియ్ వోయిగ్ట్ ..లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఎలక్ట్రిక్ మోటార్ తయారీ సంస్థ WED లో అతిపెద్ద వాటాదారు. WEG ని ఆమె తాత వెర్నర్ రికార్డో వొయిగ్ట్ కోఫౌండర్. ఇతను ఎగ్గాన్ జీవో డా సిల్వా, గెరాల్డో వెర్నింగ్ హౌస్ లతో కలిసి స్థాపించారు.
WEG ఎలక్ట్రిక్ మోటార్లు, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ లు, సాఫ్ట్ స్టార్టర్లు, కంట్రోల్స్, ప్యానెల్స్, ట్రాన్స్ ఫార్మర్లు, జనరేటర్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకి ఉంది.
1.1 బిలియన్ డాలర్ల నికర సంపదతో లివియా, ఆమె అక్క డోరా వొయిగ్ట్ డీ అసిస్ తో కలిసి 2024లో అత్యంత పిన్న వయస్సురాలైన బిలియనీర్ జాబితాలో ఏడుగురు కొత్త ర్యాంక్స్ లో చేరారా. 26 ఏళ్ల డోరా 2020లో ఆర్కిటెక్చర్ డిగ్రీని పొందారు.
ప్రపంచ వేదికపై ప్రకంపనలు సృష్టిస్తున్న యువ బిలియనీర్లలో భారత దేశం నుంచి కూడా యువ బిలియనీర్లు ఉన్నారు. వీరిలో జెరోధా, నితిన్, నిఖిల్ కామత్ వ్యవస్థాపకులు, ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకులు సచిన్, బిన్నీ బన్సాల్ ఉన్నారు.
37 ఏళ్ల నిఖిల్ కామత్ 3.1 బిలియన్ డాలర్ల నికర సంపదతో భారత దేశపు అత్యంత చిన్న వయస్సు బిలియనీర్ గా పేరు గాంచాడు. 41 బిన్నీ బన్సాల్ 1.4 బిలియన్ డాలర్ల నికర సంపదతో భారతదేశపు రెండోఅతిచిన్న వయస్సు గల బిలియనీర్. 42 ఏళ్ల అతని సోదరుడు సచిన్ 1.2 బిలియన్ డాలర్ల కొత్త సంపదతో జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు.
ఈ యువ పారిశ్రామిక వేత్తలు ఈ సంవత్సరం పోర్బ్స్ లిస్ట్ లో ప్రముఖంగా ఉన్నారు. ఇది భారతదేశం శక్తివంతమైన వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రదర్శిస్తుంది.