
టాలీవుడ్ సమస్యలపై ఏపీ సీఎం జగన్ ను కలిసేందుకు కాసేపట్లో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లనున్నారు సినీ పెద్దలు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరనుంది టాలీవుడ్ బృందం. 11 గంటల సమయంలో సీఎంతో భేటీ కానున్నారు.. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, అలీ, రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి తోపాటు మరికొంతమంది జగన్ ను కలవనున్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో సినిమా టిక్కెట్ ధరలు, స్పెషల్ షో లపై చర్చించే ఛాన్స్ ఉంది. సామాన్యులకు సినిమా టికెట్ ధర అందుబాటులోకి ఉండాలంటూ.. థియేటర్ లో టికెట్ ధరలు తగ్గించడంతో పాటు, బెనిఫిట్ షోలకు అనుమతిని నిరాకరించింది ఏపీ సర్కార్. సినీ పరిశ్రమకు సంబంధించి 17 అంశాలను సీఎం ముందు పెట్టనున్నారు. త్వరలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి కొన్ని విభాగాలు ఏపీలో పెట్టడం పై కూడా చర్చించనున్నట్లు చర్చించే అవకాశం ఉంది.