
హైదరాబాద్: ఇంటర్నేషనల్ చెస్ డేను పురస్కరించుకుని వరాస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 19, 20వ తేదీల్లో మెగా చెస్ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నారు. మాదాపూర్‌లోని వైష్ణవి స్కూల్ ఆఫ్ అర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్‌లో అండర్-–15, 19 ఓపెన్ కేటగిరీల్లో పోటీలు జరగనున్నాయి.
గిన్నిస్ వరల్డ్ రికార్డు హోల్డర్, ఆరు లిమ్కా వరల్డ్ రికార్డ్స్ హోల్డర్, ఇంటర్నేషనల్ ఫిడే రేటెడ్ చెస్ ప్లేయర్, ఎస్‌ఏఏఆర్‌సీ చాంపియన్, నేపాల్ ఓపెన్ చాంపియన్ అయిన రాఘవ్ శ్రీవత్సవ్ వరయోగి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. టోర్నీలో పాల్గొనే ఆసక్తి గలవారు వివరాల కోసం 7396847937లో సంప్రదించవచ్చు.