
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రీసెంట్ రీసెంట్ గా రిలీజ్క్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోకు కూడా ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
దాదాపు 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ముందుగా 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే అది కాస్త 2024 సమ్మర్ కు పోస్ట్ ఫోన్ అయ్యింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సమ్మర్ నుండి కూడా
తప్పుకుంది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇదే విషయంపై ఫుల్ ఫైర్ అవుతున్న మెగా ఫ్యాన్స్. చాలా రోజులుగా సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదని, వంటనే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు SVC బ్యానర్‌తో పాటు దిల్ రాజు, శంకర్‌పై ట్రోల్స్ చేస్తున్నారు. #WakeupShankaSir, #UselessDilrajuShamelessSVC అనే హ్యాష్‌ట్యాగ్స్ కూడా ట్రెండ్ చేస్తున్నారు.
అయితే ఈ ట్రోలింగ్స్ పై గేమ్ ఛేంజర్ మేకర్స్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. మరి ఈ హ్యాష్‌ట్యాగ్స్ ను చూసైనా మేకర్స్ అప్డేట్ ఇస్తారా అనేది చూడాలి మరి.