సెలబ్రెటీ అయ్యాక ఆ సాయం చేయలేకపోతున్నా

సెలబ్రెటీ అయ్యాక ఆ సాయం చేయలేకపోతున్నా

సెన్సిటివ్ ఇష్యూతో నవ్వులు పూయించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు హీరో సాయి ధరమ్ తేజ్. ‘ప్రతి రోజూ పండగే’ సినిమాతో కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ హీరోతో ‘V6velugu’ చిట్ చాట్..

‘ప్రతిరోజూ పండగే’  హిట్​టాక్​తో దూసుకుపోతోంది కదా ఎలా అనిపిస్తోంది?

చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద సక్సెస్​ ఇచ్చిన ఆడియెన్స్​కి ముందుగా  థ్యాంక్స్​  చెప్పాలి. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి సినిమాకి మంచి రెస్పాన్స్​ వస్తోంది. రీసెంట్​గా ఫ్రెండ్స్​తో  కలిసి థియేటర్​లో మూవీ చూశా. ఆడియెన్స్​ కేకలు, విజిల్స్​, నవ్వులు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఏజ్​ లిమిట్​ లేకుండా అందరూ కామెడీని బాగా ఎంజాయ్​ చేస్తున్నారు. మామయ్య కూడా సినిమా చూసి ‘యాక్టింగ్ బాగుంది, మంచి కథని ఎంచుకున్నావ్’​ అని మెచ్చుకున్నారు.  సినిమా సక్సెస్​ కన్నా మామయ్య (చిరంజీవి) నోట్లోనుంచి వచ్చిన  ఆ మాట మరింత హ్యాపీనెస్​ ఇచ్చింది.  అమ్మ కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. నిజం చెప్పాలంటే నాకన్నా నా ఫ్యామిలీయే ఈ సక్సెస్​ని ఎక్కువగా ఎంజాయ్​ చేస్తోంది.

చావులాంటి సెన్సిటివ్ ఇష్యూతో కామెడీ అంటే భయమేయలేదా?

కథ విన్నప్పుడు ఎక్కడ మిస్​ఫైర్​ అవుతుందోనని కొంచెం భయపడ్డా. కానీ మారుతి టేకింగ్ మీద నమ్మకంతో ఓకే చేశా. నా నమ్మకాన్ని మారుతి వందశాతం నిజం చేశాడు. ఎక్కడా ఓవర్​ బోర్డ్ వెళ్లకుండా కథని బ్యాలెన్స్​ చేశాడు.  నిజం చెప్పాలంటే నిజజీవితంలో కూడా ఇలాంటి వాళ్లు  మన చుట్టు పక్కల ఉంటారు. కానీ బయటకు కనపడరు.

హిట్, ఫ్లాప్​లని ఎలా తీసుకుంటారు?

రెండింటి గురించి పెద్దగా పట్టించుకోను. నా పని సరిగా చేశానా? లేదా? అని ఆలోచిస్తా. సినిమా ఫ్లాప్‌‌ అయితే.. ఎక్కడ తప్పు జరిగింది? తెలుసుకుని తర్వాత సినిమాకి జాగ్రత్తపడతా. సక్సెస్ నుంచి ఇంకా కష్టపడాలని నేర్చుకుంటా.  హిట్, ఫ్లాప్​ రిజల్ట్​ ఏదైనా స్థిమితంగా ఉంటా.

రియల్​ లైఫ్​లో ఎలా ఉంటారు?

ఆన్​ స్క్రీన్​కి ఆఫ్​ స్క్రీన్​కి పెద్దగా తేడా ఉండదు. ఇంట్లో కూడా ఎప్పుడూ సరదాగా అందర్నీ ఆటపట్టిస్తూ , నవ్విస్తూ ఉంటా. ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో ఉంటా. డ్యాన్స్​ చేస్తూ, పాటలు పాడుతూ ఇల్లంతా గోలగోల చేస్తా.  నేనుంటే ‘సందడి ఉన్నట్టే ’అంటుంది అమ్మ. ఇక ఫ్యామిలీ ఫంక్షన్స్​లో అయితే నేను, చరణ్​ అన్న, వరుణ్ కలిస్తే  ఆ హడావిడే వేరుగా ఉంటుంది. ఫ్రెండ్స్​తో  కూడా అవుటింగ్స్​కి  వెళ్తూ ఉంటా.

తిక్క’ సినిమా హీరోయిన్​ లరిస్సా బోనేసి​పై క్రష్​ ఉందని చెప్పారు, సినిమా తర్వాత కూడా క్రష్​ కంటిన్యూ అవుతోందా?

అందరూ ఇది బాగా గుర్తుపెట్టుకున్నట్టున్నారు. తను నా ఆల్​టైమ్​ క్రష్​. ఈ విషయం తనకి కూడా చెప్పా. కానీ సినిమా  పూర్తయ్యాక తనతో టచ్​లో లేను. ఇన్​స్ట్రాగ్రామ్​లో అప్పుడప్పుడు ‘హాయ్, బాయ్​ ’ అంతే. ఏమైనా పోస్ట్​లు పెడితే  చూస్తుంటా? అంతకు మించి మా మధ్య ఏం లేదు.

Related image

ఆఫ్​స్క్రీన్​లో అమ్మాయిల కోసం ఫైట్స్ ఏమైనా చేశారా?

లేదు. ఫైట్స్ వరకు ఎప్పుడూ వెళ్లలేదు. చెప్తే  నమ్మరు కానీ… అసలు అమ్మాయిలు నా వైపే చూసేవాళ్లు కాదు. ఇక వాళ్లకోసం ఫైట్స్ ఏం చేస్తాం.  నేను ఎవరికి ప్రపోజ్​ చేసినా ఆన్సర్​ ‘నో’ అనే వచ్చేది.  ఆన్సర్​ నో రావడంతో వాళ్లకి రాసిన లవ్​లెటర్​నే ​ నచ్చిన వాళ్లందరికీ పాస్​ చేసేవాడ్ని.  కానీ ఒక్కరూ పట్టించుకోలేదు అప్పట్లో. హీరో అయ్యాక మాత్రం నెమ్మదిగా  కాంటాక్ట్‌‌లోకి వస్తున్నారు. నాపై వస్తున్న  ఈ రూమర్ల దయ వల్ల ఆ కాంటాక్ట్‌‌లు కూడా పోయేలా ఉన్నాయి.(నవ్వుతూ)

మీపై వచ్చిన రూమర్స్​లో మీరు బాగా నవ్వుకుంది ఏదైనా ఉందా?

నాకే తెలియకుండా నాపెళ్లి చేసేశారు ఈ మధ్య.  అది తలుచుకుంటే ఫుల్ నవ్వు వస్తుంది. పెళ్లి ఒక్కటే కాదు, పిల్లలు కూడా అని రాశారు కొంతమంది. నా ప్రమేయం లేకుండా నా పెళ్లి ఎలా అయిందో నాకే అర్థం కావట్లేదు. ఇప్పటికీ నా మీద ఇలాంటి రూమర్స్ చాలానే వస్తుంటాయి. అలాగే ‘సైరా’ సినిమాలో నేను స్పెషల్ రోల్​ చేస్తున్నట్టు రూమర్లు చక్కర్లు కొట్టాయ్​. అది రూమరే ​ అని తెలిసినా చాలా హ్యాపీ అనిపించింది. లైఫ్​లో ఫస్ట్ టైం  ఆ రూమర్​  నిజమైతే బాగుండని ఆశపడ్డా. కానీ బ్యాడ్​లక్​ నిజమవలేదు. ఫ్యూచర్​లో మరే సినిమాలోనైనా అది అవుతుందేమో చూడాలి.

సినిమాలు  కాకుండా… ఏమంటే మీకు బాగా ఇష్టం?

క్రికెట్‌‌ చూడడం కంటే ఆడడం బాగా ఇష్టం. సెలబ్రిటీ క్రికెట్ లీగ్​ పుణ్యమా అని ఇంటర్నేషనల్‌‌ స్టేడియాలలో ఆడే అవకాశం దక్కింది. అంతకు ముందు స్కూల్‌‌ లెవెల్లో చాలా మ్యాచ్‌‌లు ఆడా. మిడిల్‌‌ ఆర్డర్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ని. మిడిల్‌‌ ఆర్డర్‌‌ కాబట్టి ఎప్పుడోగానీ బ్యాటింగ్‌‌ అవకాశం వచ్చేది కాదు. వచ్చామా? బాదామా? పోయామా? అన్నట్టే ఉండేది. అయితే హైదరాబాద్‌‌ తరఫున ఆడుతూ ఓసారి సెంచరీ కొట్టా. క్రికెట్ కాకుండా  వంటలు బాగా చేస్తా.  కోడలు రావడానికి టైం పడుతుంది అని అమ్మకి అర్థమైనట్టుంది. అందుకే నాకే  వంట నేర్పించేసింది. వెజ్​, నాజ్​వెజ్​ ఏదైనా సరే టేస్టీగా వండుతా.

పెళ్లి ఆలోచన…

అస్సలు లేదు. ప్రస్తుతం ఆ విషయాలేం ఆలోచించడం లేదు. నా దృష్టంతా సినిమాలపైనే! పెళ్లంటూ అమ్మ వెంటపడుతూనే ఉంటుంది. కానీ, ఆ  ప్రస్తావన వచ్చినప్పుడల్లా నేను మాట మార్చేస్తుంటా. పెళ్లి విషయంలో ‘నా మాట వినడు’ అని అమ్మ కూడా ఫిక్సయిపోయింది.

జూనియర్​ చిరంజీవి అంటుంటారు కదా మిమ్మల్ని! ఎలా అనిపిస్తుంది?

నాలో చిరంజీవి లాంటి గొప్ప నటుడ్ని చూసుకుంటున్నారంటే అది నా అదృష్టమే.  ఆ పిలుపుని నేను ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతా. ఆయన్ని  నేను మ్యాచ్​ చేయడమంటే ఇంపాజిబుల్. అందుకే కనీసం ఆయన స్టాండర్డ్స్​​ తగ్గకుండా ఉండటానికి కష్టపడతా. అమ్మ కూడా ఎప్పుడూ ఒకేమాట చెప్తుంటుంది – ‘మామయ్య పేరు కాపాడకపోయినా పర్లేదు. కానీ చెడగొట్టకు’ అని.  ఆ మాటలు ఎప్పుడూ నా మైండ్​లో రన్​ అవుతునే ఉంటాయ్​.
అందుకే ఏ పని చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తా.

టాయ్స్​ అంటే ఇష్టం

వినడానికి కాస్త సిల్లీగా ఉంటుంది గానీ, నాకు టాయ్స్ అంటే చాలా ఇష్టం. అందుకే కొత్త కొత్త బొమ్మలు కొనుక్కొని ఆడుకుంటూ ఉంటా. అవి ఉంటే నాకు ఫుల్ టైం పాస్​. అలాగే నా ఫ్రెండ్స్​ , కజిన్స్​ కోసం బాగా  ఖర్చు చేస్తా. వాళ్లకి మంచిమంచి గిఫ్ట్​లు కొంటూ ఉంటా.  అక్కడే నా పాకెట్​కి ఎక్కువగా చిల్లు పడుతుంది.

సెలబ్రిటీ అయ్యాక ఫ్రీడమ్​ తగ్గిందని అనుకుంటున్నారా?

బాగా తగ్గింది. ఉదాహరణకి ఒక ఐదేళ్ల క్రితం నేను కారులో వెళ్తుంటే ఒక ముసలాయన కనిపించాడు.  ట్రాఫిక్​లో రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నాడు. అది గమనించి కారు పక్కకు ఆపి వెళ్లి రోడ్డు దాటించా. కానీ అదే పని ఇప్పుడు చేయలేకపోతున్నా. చాలామంది అలాంటి సిచ్యుయేషన్స్​లో తారసపడుతున్నారు. కానీ ఇంతకుముందులా సాయం చేయలేకపోతున్నా. ఇలాంటి విషయాల్లోనే ఫ్రీడమ్​ని ఎక్కువగా మిస్​ అవుతున్న ఫీలింగ్ వస్తుంది.

సోషల్ ఇష్యూస్​పై ఎలా రియాక్ట్ అవుతారు?

చాలా త్వరగా రియాక్ట్ అవుతా. నా వైపు నుంచి నేనేమైనా చేయగలుగుతానా?  నేనేమైనా చేస్తే వాళ్లకి రిలీఫ్​ వస్తుందా?  అని ఆలోచించి వెంటనే చేస్తుంటా. నావంతు ప్రయత్నంగా నేను చేయాల్సింది చేస్తా. అలాగని నన్ను నేను ఇబ్బంది పెట్టుకుంటూ ఒకరికి సాయం చేయను. వీలైనంత ఎక్కువమందికి సాయం చేయాలనేది నా డ్రీమ్​. ఫ్యూచర్​లో అన్నీ  కలిసొస్తే అదీ సాధ్యమవుతుంది.

షూటింగ్  లేనిరోజుల్లో  ఏం చేస్తారు?

రాత్రికి, పగలుకి తేడా తెలియనంతగా నిద్రపోతా.  షూటింగ్​ ఉంటే ఉదయాన్నే లేవాలి.  లేవాలి అంటే రాత్రి త్వరగా పడుకోవాలి. అది కొంచెం కష్టం. దానివల్ల  నిద్ర అసలు సరిపోదు. అందుకే ఖాళీ టైం దొరికితే చాలు నిద్రపోతా.  లేదంటే ఫ్రెండ్స్​తో సరదాగా సినిమాలకి వెళ్తూ ఎంజాయ్​ చేస్తా. అమ్మతో నా ఫేవరెట్ పప్పు  చేయించుకుని తింటా. అప్పుడప్పుడు వండుతా కూడా. నేను మంచి కుక్​ని.