గాంధీలో మెగా పీడియాట్రిక్‌‌ హెల్త్ క్యాంపు

గాంధీలో మెగా పీడియాట్రిక్‌‌  హెల్త్  క్యాంపు

పద్మారావునగర్​,వెలుగు: భారత ప్రభుత్వ ఫ్యామిలీ ప్లానింగ్‌‌ అడిషనల్​ కమిషనర్‌‌ డాక్టర్‌‌ ఇందు గ్రేవాల్‌‌ గురువారం సికింద్రాబాద్‌‌ ఎంజీఎం దవాఖానను సందర్శించారు. పీడియాట్రిక్‌‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పీడియాట్రిక్‌‌ హెల్త్​ క్యాంపును ప్రారంభించారు.

 చిన్నారులకు ఉచిత వైద్య పరీక్షలు, అవసరమైన చికిత్సలు, పోషకాహారం, టీకాలు, ఆరోగ్య సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్‌‌ డాక్టర్‌‌ ఎన్‌‌.వాణి, పీడియాట్రిక్‌‌ హెడ్​ డాక్టర్‌‌ వాసుదేవ్‌‌, డాక్టర్‌‌ అజయ్‌‌ మోహన్‌‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌‌ సునీల్‌‌కుమార్‌‌  
పాల్గొన్నారు.