
మెగా కుటుంబంలోకి క్లింకారా అడుగుపెట్టి అప్పుడే సంవత్సరం గడిచింది. దీంతో జూన్ 20న మెగా కుంటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. నిజానికి చెప్పాలంటే క్లింకారా రాక మెగా కుటుంబానికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆమె రాక తరువాత వారి కుటుంబంలో చాలా స్పెషల్ మూమెంట్స్ జరిగాయి. వరుణ్ తేజ్ పెళ్లి, మెగాస్టార్ కి పద్మ విభూషణ్, రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ గ ఎదగడం, ఎలెక్షన్స్ లో పవన్ కళ్యాణ్ విజయం ఇలా చాలా జరిగాయి. అందుకే క్లింకారా రాక ఆ ఫ్యామిలీకి చాలా ప్రత్యేకంగా మారింది.
నేడు జూన్ 20 క్లింకారా మొదటి పుట్టినరోజు కావడంతో మెగా కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. ఇందుకోసం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారని సమాచారం. అయితే.. కూతురు క్లింకారా మొదటి పుట్టినరోజు సంధర్బంగా ఉపాసన ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఉపాసన ప్రెగ్నెన్సీ అయినప్పటికి నుండి క్లింకారా పుట్టెంత వరకు వాళ్ళు ఎలా అయ్యారు అనే ప్రతీవిషయన్నీ ఆ వీడియోలో చూపించారు. ఇక మొదటిసారి తన ముద్దుల కూతురిని ఎత్తుకొని రాం చరణ్ ఎమోషనల్ అయిన సందర్బం ఎంతో క్యూట్ గా ఉంది. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.