
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి సోమవారం భేటీ కానున్నారు. ఇందుకోసం ఈ ఉదయం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో సతీసమేతంగా గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ వద్ద అభిమాన సంఘాలు వారికి ఘనస్వాగతం పలికాయి. ఆ తర్వాత గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి మర్యాద పూర్వకంగా కలవనున్నారు. అయితే ఈ కలయిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చిరంజీవి వైసీపీ లో చేరడడానికే అని కొందరు అంటుంటే, ఆయన సన్నిహితులు మాత్రం తాను నటించిన సైరా సినిమాను చూడాలని జగన్ ను కోరేందుకే ఈ భేటీ అని అంటున్నారు.