యాక్షన్ మోడ్‌‌‌‌లో విశ్వంభర సినిమా

యాక్షన్ మోడ్‌‌‌‌లో విశ్వంభర సినిమా

చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట రూపొందిస్తున్న సోషీయో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. త్రిష హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్  శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే కొన్ని టాకీ పార్ట్‌‌‌‌లు, ఒక పాట, ఒక యాక్షన్ బ్లాక్‌‌‌‌ని చిత్రీకరించిన మేకర్స్, తాజాగా కీలకమైన యాక్షన్ షెడ్యూల్‌‌‌‌ను ప్రారంభించారు.

ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్  పర్యవేక్షణలో హైదరాబాద్‌‌‌‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిరంజీవి, కొంతమంది ఫైటర్స్‌‌‌‌పై  ప్రస్తుతం  హై- ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు.  కీలకమైన దశలో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌‌‌‌ను ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు.  అలాగే ఈ షెడ్యూల్‌‌‌‌లో  చిరంజీవి, త్రిషతో పాటు ఇతర నటీనటులపై కూడా ఇంపార్టెంట్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఇందులో చిరంజీవి డ్యూయెల్ రోల్ చేస్తున్నారని, అందులో ఒకటి యంగ్‌‌‌‌ లుక్‌‌‌‌ కాగా, వయసు పైబడిన మరో పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. సురభి, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, ప్రవీణ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.