జమ్మూ కశ్మీర్‌‌ను బహిరంగ జైలుగా మార్చేశారు

జమ్మూ కశ్మీర్‌‌ను బహిరంగ జైలుగా మార్చేశారు

కుల్గాం: జమ్మూ కశ్మీర్ వనరులు దోపిడీకి గురవుతున్నాయని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ అన్నారు. కశ్మీర్‌‌ను కేంద్రం బహిరంగ జైలుగా మార్చేసిందని ఆమె దుయ్యబట్టారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న రాంబియారా నల్లాకు తనను వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంపై మెహబూబా ఫైర్ అయ్యారు. ‘నన్ను రాంబియారా నల్లాకు వెళ్లనివ్వకుండా స్థానిక అధికారులు అడ్డుకున్నారు. ఇక్కడి నుంచే బయటి వ్యక్తులకు ఇసుకను అక్రమ టెండర్ల పేర్లతో అమ్మేస్తున్నారు. స్థానిక వనరులను కేంద్ర ప్రభుత్వం దోచుకుంటోంది. నయా కశ్మీర్ కోసం కేంద్రం పన్నిన వంచించే ఆలోచన ఇది. ఒక నేతగా ప్రజల మనోవేదనను చెప్పడం నా బాధ్యత. కానీ సెక్యూరిటీ పేరిట నా హక్కులను, మా ఉద్యమాన్ని బీజేపీ అడ్డుకుంటోంది’ అని మెహబూబా పేర్కొన్నారు.