రెండున్నర దశాబ్ధాల సినీ కెరీర్‌లో స్లమ్ డాగ్ మిలియనీర్, మిషన్ ఇంపాజిబుల్4 లాంటి హాలీవుడ్ చిత్రాలకు కెమెరా అసిస్టెంట్‌గా పనిచేశారు కిషోర్ బోయిడపు. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అనిల్ మెహతా దగ్గర నేర్చుకున్న ప్రతి విషయం సినిమాటోగ్రఫీ జర్నీలో ఎంతో ఉపయోగపడిందని ఆయన చెప్పారు. రీసెంట్‌గా ఆయన వర్క్ చేసిన ‘మేము కాప్‌లం’ వెబ్ సిరీస్ జీ5లో సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ ‘ఈ సిరీస్ మొత్తం షూటింగ్‌ను కేవలం 17 రోజుల్లో పూర్తి చేశాం.
పర్ఫెక్ట్ ప్రీ -ప్రొడక్షన్ ప్లానింగ్‌తోనే ఇది సాధ్యమైంది. అలాగే ప్రతి డిపార్ట్‌మెంట్ ఎంతో కష్టపడి పనిచేసి ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు అందరూ తమ బెస్ట్ ఇచ్చారు. ఈ ప్రయాణంలో క్లారిటీతో, సపోర్ట్‌తో ముందుండిన డైరెక్టర్ ప్రదీప్‌కి, సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ బీవీఎస్ రవి గారికి, ప్రొడక్షన్ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు.
ప్రస్తుతం ‘ప్రేమకు నమస్కారం’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, ‘మన డాక్టర్ బాబు’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచన ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ నేర్చుకోవడంపై దృష్టి పెట్టాను’ అని చెప్పారు.
