ఎమర్జెన్సీలో కంగనా ఫస్ట్ లుక్ అదుర్స్

ఎమర్జెన్సీలో కంగనా ఫస్ట్ లుక్ అదుర్స్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజురానే వచ్చింది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ నటిస్తున్న కొత్త మూవీ ఎమర్జెన్సీ టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా కనిపించారు. ఈ సినిమాకు సంబంధించి  ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. టీజర్ లో  కంగనా రనౌత్ ఇందిరా గాంధీ రూపాన్ని, హావభావాలు, భాషను విజయవంతంగా అనుకరించింది. కళ్లజోడుతో కాటన్ చీర ధరించి కనిపించింది. వీడియోలో కంగనాకు అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిస్సింజర్ నుండి కాల్ వచ్చింది. అమెరికన్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ఆమెను సాధారణంగా సార్ అని కాకుండా మేడమ్ అని సంబోధించగలరా అని అడిగారు. కంగనా ఇందిర వలె, ఒక బీట్ తీసుకొని అవును అని చెప్పింది. కానీ ఆమె సెక్రటరీ వైపు తిరిగి, ఆమె కార్యాలయంలో అందరూ తనను సర్ అని పిలుస్తున్నారని US అధ్యక్షుడికి చెప్పండి అంటూ కంగనా చెప్పిన డైలాగ్ లు ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది.

 

1977లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ గురించే సినిమా ఉంటుందనీ, అందులో తాను ఆమె పాత్రనే పోషిస్తున్నట్టు కంగనా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. సొంత నిర్మాణ సంస్థ మణికర్ణికా ఫిల్మ్స్ బ్యానర్లోనే ఈ చిత్రం నిర్మిస్తున్నానని తెలిపింది. పొలిటికల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఎమర్జెన్సీకి దారి తీసిన పరిస్థితులు, రాజకీయ కుట్రలు, దేశం ఎదుర్కొన్న సంక్షోభం వంటివి చూపించబోతున్నారు.  ఎమర్జెన్సీ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఒక అద్భుతమైన ప్రయాణం అని కంగనా అభివర్ణించారు.