హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. వచ్చే 24 గంటలు భారీ వర్షాలు

హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. వచ్చే 24 గంటలు భారీ వర్షాలు

హైదరాబాద్: రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్‌‌ల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది. హైదరాబాద్‌లో మేఘావృతమైన వాతావరం ఉంటుందని చెప్పిన భారత వాతావరణ శాఖ (ఐఎండీ).. నగరంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నాయని తెలిపింది. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కొమురం భీం అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, సిద్ధిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ అర్బన్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డిల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.