
హైదరాబాద్ సిటీ, వెలుగు: మంగళవారం ఉదయం మెట్రో మరోసారి మొరాయించింది. మియాపూర్ ఎల్బీనగర్ రూట్ లో దాదాపు 8 నిమిషాల పాటు మెట్రో ఆగిపోయింది. ఆఫీస్ అవర్స్ లో మెట్రో ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మెట్రో అధికారులపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అయితే, ఎందుకు ఆగిపోయిందో చెప్పడానికి ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు అందుబాటులోకి రాలేదు.