అగ్ని పథ్ ఎఫెక్ట్..మెట్రో రైళ్లు రద్దు

అగ్ని పథ్ ఎఫెక్ట్..మెట్రో రైళ్లు రద్దు

అగ్నిపథ్కు వ్యతిరేకంగా  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిగుండంగా మారిన నేపథ్యంలో మెట్రో రైళ్లను  నిలిపివేశారు.  హైదరాబాద్లోని  మూడు లైన్లలో నడిచే మెట్రో రైల్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. దీంతో అన్ని మెట్రో గేట్లను అధికారులు మూసివేశారు. అటు మెట్రో సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మెట్రో సేవలను నిలిపివేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.  మెట్రో గేట్ల వద్దకు వచ్చి..గేట్లు మూసిఉండటంతో..తిరిగి వెళ్లిపోతున్నారు.  మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ఆందోళనకారుల బీభత్సం సృష్టించడంతో..రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. కొన్ని రైళ్లను దారి మళ్లించింది. అటు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటనను పునరావృతం కాకుండా రాష్ట్రంలోని మేజర్ రైల్వే స్టేషన్లలో పోలీసులను మోహరించింది. అనుమానితులను ఆయా రైల్వే స్టేషన్లకు అనుమతించడం లేదు.