హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణాన్ని ఆపే దమ్ము మాజీ మంత్రి హరీశ్ రావు, ఆయన మామ (కేసీఆర్), బామ్మర్ది (కేటీఆర్)కు లేదని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు. హరీశ్ రావు మతిలేని మాటలు మాట్లాడుతున్నారని ఆదివారం పత్రిక ప్రకటనలో మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి కాలి గోటికి సరిపోని దుర్మార్గులు ఆయనపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఫ్యూచర్ సిటీ అంటే తెలంగాణ యువత భవిషత్తు అని చెప్పారు. గత పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ యువతను పట్టించుకునే పాపాన పోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అమరవీరుల కుటుంబాలు, నిరుద్యోగుల ఆశీర్వాదం ఉందని పేర్కొన్నారు.
