హరీశ్ రావు కాదు.. అబద్ధాల రావు : మెట్టు సాయికుమార్

హరీశ్ రావు కాదు.. అబద్ధాల రావు : మెట్టు సాయికుమార్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం, మేడిగడ్డ వైఫల్యం కేసీఆర్, హరీశ్‌‌‌‌రావుల పాపమేనని ఫిషరీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మెట్టు సాయికుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం కమీషన్ల కోసం కక్కుర్తి పడి మేడిగడ్డ బ్యారేజీని నాశనం చేశారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌‌‌‌లోని గాంధీ భవన్‌‌‌‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెట్టు సాయి కుమార్ మాట్లాడారు.

కాళేశ్వరం వైఫల్యంలో కేసీఆర్‌‌‌‌కు ఎంత భాగస్వామ్యం ఉందో, హరీశ్‌‌‌‌రావుకు కూడా అంతే పాపం ఉందని ఆయన విమర్శించారు. బీఆర్‌‌‌‌ఎస్ నేతలు తాము చేసిన తప్పులను కళ్లారా చూడాలనే ఉద్దేశంతోనే వారిని మేడిగడ్డ సందర్శనకు అనుమతించామని తెలిపారు. హరీశ్‌‌‌‌రావును అబద్ధాల రావుగా అభివర్ణిస్తూ, అబద్ధాలు చెప్పడంలో ఆయన తన మామ కేసీఆర్‌‌‌‌ను మించిపోయారని ఎద్దేవా చేశారు.

బీఆర్‌‌‌‌ఎస్ పార్టీలో నంబర్-2 స్థానాన్ని దక్కించుకోవడం కోసమే హరీశ్‌‌‌‌రావు నానా తంటాలు పడుతున్నారని, కానీ అది ఎప్పటికీ నెరవేరదని ఆయన వ్యాఖ్యానించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన సీనియర్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్‌‌‌‌లకు నాయకత్వ లక్షణాలు లేవా అని, వారికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యే అర్హత లేదా అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా బీఆర్‌‌‌‌ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదని, బలాదూర్ రాష్ట్ర సమితి, బేకార్ రాష్ట్ర సమితి, బట్టేబాజ్ రాష్ట్ర సమితి అని విమర్శించారు. అలాగే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అక్రమాలపై త్వరలోనే సమగ్ర విచారణ జరిపిస్తామని హెచ్చరించారు.