శాలరీ ఎక్కువ.. లివింగ్ కాస్ట్ తక్కువ.. క్యూ కడుతున్న ఇండియన్స్

శాలరీ ఎక్కువ.. లివింగ్ కాస్ట్ తక్కువ.. క్యూ కడుతున్న ఇండియన్స్

తెలుగు టెకీల న్యూ డెస్టినేషన్ ‘‘గౌడలజర”
లివింగ్ కాస్ట్​ తక్కువ.. శాలరీ ఎక్కువ
వీసా నిబంధనలూ ఈజీ..
అట్నుంచి యూఎస్‌‌కూ పోవొచ్చు

అగ్రరాజ్యం అమెరికా ఐటీ జాబ్​లకు అడ్డా. మన సాఫ్ట్​వేర్​ ఇంజనీర్లు అక్కడికి వెళ్లి జాబ్​ చేయాలని కలలు కంటుంటారు. ముఖ్యంగా తెలుగు టెకీలు అమెరికా వెళ్లాలని ఎంతో ప్లాన్​ చేసుకుంటుంటారు. ఆ అవకాశం కోసం ఏండ్లుగా ఎదురు చూస్తుంటారు. కంపెనీ ఎప్పుడు ఆఫర్​ చేస్తుందా? ఎప్పుడు వెళ్దామా? అన్నట్లు ఉంటారు. ఫ్రెషర్స్​మొదలుకొని సీనియర్స్ వరకు చాలమందిది ఇదే డ్రీమ్​. అయితే ఇప్పుడు సీన్ మారింది. మనోళ్లు ‘‘అమెరికా వద్దు… మెక్సికో ముద్దు’’ అంటున్నారు. అమెరికా కంటే మెక్సికో వెళ్లడానికే ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఇక్కడి గౌడలజర సిటీకి క్యూ కడుతున్నారు. ఇప్పుడీ సిటీ మనోళ్ల న్యూ డెస్టినేషన్​గా మారింది. అంతగా ఈ సిటీలో ఏముంది? అమెరికాను మించి ఎందుకు ఆకర్షిస్తోంది?

లివింగ్ కాస్ట్ బెంగళూరంతే..

ప్రధానంగా తెలుగోళ్లకు గౌడలజర స్వర్గధామంగా మారింది. ప్రస్తుతం అక్కడ 2,000 తెలుగు ఫ్యామిలీస్​ ఉంటున్నాయని తెలంగాణ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ అసోసియేషన్ (టీఐటీఏ) ప్రెసిడెంట్​సందీప్​ కుమార్​మక్తాలా చెప్తున్నారు. ఇక్కడ టీసీఎస్, హెచ్​సీఎల్ లాంటి పెద్ద కంపెనీలు​సహా125 ఐటీ సంస్థలు కూడా ఉన్నాయట. దీంతో యంగ్ ఐటీ ప్రొఫెషనల్స్​మెక్సికో వెళ్లేందుకే ఇష్టపడుతున్నారు. మరోవైపు వీసా రూల్స్​ఈజీగా ఉండడం, శాలరీ ప్యాకేజీలు అధిక మొత్తంలో రావడం, లివింగ్​కాస్ట్​ కూడా తక్కువగా ఉండడం, అమెరికాకు పక్కనే మెక్సికో ఉండడం కూడా దీనికి కారణాలు. ‘‘గౌడలజరా సిటీలో లివింగ్​కాస్ట్​ బెంగళూర్​కు సమానంగా ఉంటుంది. పేయింగ్​గెస్ట్​ హాస్టల్స్​కూడా ఈజీగా దొరుకుతాయి. సింగిల్​రూమ్​కు రూ.15,000 చెల్లిస్తే సరిపోతుంది” అని సందీప్​ చెప్పారు. ఇక గౌడలజరలో వలస వచ్చినవారే ఎక్కువ కావడంతో క్రైమ్​ రేట్​కూడా తక్కువగా ఉంటుంది. శాలరీ విషయానికి వస్తే ఫ్రెషర్​కు నెలకు యావరేజ్​గా30,000 పెసోస్​ (రూ.1.10 లక్షలు) ఉంటుంది. అదే ఇండియాలో ఫ్రెషర్​ స్టార్టింగ్​ప్యాకేజీ ఏడాదికి రూ.3–5 లక్షలు. మెక్సికన్స్ కు టెక్నికల్, ఇంగ్లిష్​ స్కిల్స్ తక్కువుండటమూ మనోళ్లకు కలిసొస్తోందని అంటున్నారు.