MI vs RCB: టీ20 చరిత్రలోనే తొలిసారి.. ముంబై, ఆర్సీబీ మ్యాచ్ అరుదైన ఘనత

MI vs RCB: టీ20 చరిత్రలోనే తొలిసారి.. ముంబై, ఆర్సీబీ మ్యాచ్ అరుదైన ఘనత

ఐపీఎల్ లో భాగంగా నిన్న(ఏప్రిల్ 11) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక అరుదైన రికార్డ్ నెలకొంది. టీ20 క్రికెట్ లో ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు .. ప్రత్యర్థి బౌలర్ 5 వికెట్లు తీయడం ఇదే తొలిసారి కావడం విశేషం. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య 17 ఫిబ్రవరి 2005న అంతర్జాతీయ క్రికెట్ లో తొలి మ్యాచ్ జరిగింది. అయితే 2003 లో తొలి అనధికారిక టీ20 మ్యాచ్ జరిగింది. 21 ఏళ్ళు గడిచినా ఈ ఫీట్ తొలిసారి నమోదై అరుదైన రికార్డ్ సెట్ చేసింది.     

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కెప్టెన్ డుప్లెసిస్(61), రజత్ పటిదార్(50) భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి అర్ధ సెంచరీలు చేయగా.. చివర్లో దినేష్ కార్తీక్ (53) మెరుపులు మెరిపించి 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు ముంబై  ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బౌలర్ 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, లోమరోర్,సౌరవ్ చౌహన్, విజయ్ కుమార్ వైశుక్ ల వికెట్లు తీసి ఐపీఎల్ లో రెండోసారి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్‌‌‌‌ ఓడిన బెంగళూరు 20 ఓవర్లలో 196/8 స్కోరు చేసింది. డుప్లెసిస్‌‌‌‌ (40 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 61), రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌ (26 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 50), దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ (23 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 53*) దంచికొట్టారు. తర్వాత ముంబై 15.3 ఓవర్లలో 199/3 స్కోరు చేసి గెలిచింది. ఛేజింగ్‌‌‌‌లో ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (34 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌లతో 69) మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌కు సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (19 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 52) సునామీ బ్యాటింగ్‌‌‌‌ తోడవ్వడంతో.. గురువారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ముంబై 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై నెగ్గింది. రోహిత్‌‌‌‌ శర్మ (38), హార్దిక్‌‌‌‌ పాండ్యా (21) రాణించారు.  బుమ్రాకు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.