Michael Clarke: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఐపీఎల్ 2026 ఫైనల్ ముగిసిన తర్వాత తనకు ఎదురైన ఓఘోర రోడ్డు ప్రమాదం గురించి హాట్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ ముగించుకుని ఎయిర్ పోర్టుకి వెళ్తుండగా.. తాను జర్నీ చేస్తున్న కారు ఓ భారీ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం ధ్వంసమైందని పాడ్‌కాస్ట్‌లో క్లార్క్ గుర్తు చేసుకుంటూ.. ప్రమాద సమయంలో తనకు హెల్ప్ చేసిన భారతీయులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు.
ట్రక్కును కారు ఢీకొట్టడంతో మెలకువ వచ్చింది:
అహ్మదాబాద్ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత సుదీర్ఘ ప్రయాణం వలన తాను కారులోనే నిద్రపోయా.. అయితే ఒక్కసారిగా పెద్ద సౌండ్ రావడంతో కారు ట్రక్కును ఢీకొట్టడంతో తనకు మెలకువ వచ్చింది, కారు ముందు భాగం ఓ భారీ ట్రక్కు కిందకు వెళ్లడం చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను.. ట్రక్కుకు సంబంధించిన బ్రేక్ లైట్లు పనిచేయకపోవడంతోనే సమయానికి బ్రేక్ వేయలేకపోయినట్లు.. డ్రైవర్ తనకు తర్వాత చెప్పాడని క్లార్క్ వివరించాడు.
యాక్సిడెంట్ తర్వాత డ్రైవర్ భయపడ్డాడు:
ఈ యాక్సిడెంట్లో మైఖేల్ క్లార్క్‌కు స్వల్ప గాయాలైనప్పటికీ.. ఆయన తన కారు డ్రైవర్ పరిస్థితిని చూసి భయపడినట్లు చెప్పుకొచ్చాడు. ఈ ఘటనలో డ్రైవర్ కాలుకు గట్టిగా దెబ్బ తగిలిందని క్లార్క్ భావించాడు. డ్రైవర్ తన ఆరోగ్యం గురించి మాత్రమే కాదు, తాను పని చేస్తున్న కంపెనీ కారు పూర్తిగా ధ్వంసమవ్వడంపై ఉద్యోగం ఎక్కడ పోతుందోనని భయపడ్డాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు. ఆ సమయంలో క్లార్క్ అతనికి ధైర్యం చెప్పి, వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సిందిగా చెప్పాడు. ఈ సమయంలో తనకు అండగా నిలిచిన స్థానిక ప్రజలను అభినందించాడు.
🚨 Michael Clarke reveals he was involved in a serious car crash in India following the IPL
— Brutal Truth (@sarkarstix) June 3, 2026
Traveling as a passenger, his car collided with a semi-trailer, with front half of the car stuck under a truck.
Clarke expressed his immense gratitude to the local people and the BCCI… pic.twitter.com/i9khDyEJm8
