పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు కీలకం : ఆర్వీ కర్ణన్

పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు కీలకం : ఆర్వీ కర్ణన్
  • బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: పోలింగ్‌ కేంద్రంలో మైక్రో అబ్జర్వర్ల  పాత్ర కీలకమని, పోలింగ్ ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసేవరకు ప్రతి అంశాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. బుధవారం జీహెచ్ఎంసీ హెడ్​ఆఫీస్​లో 120 మంది మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల అబ్జర్వర్ రంజిత్ కుమార్​తో కలిసి శిక్షణ ఇచ్చారు. 

ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సాధారణ పరిశీలకుల నియంత్రణలో మైక్రో అబ్జర్వర్ల పని చేస్తారన్నారు. మాక్ పోలింగ్ నిర్వహణ, పోలింగ్ సజావుగా ఓటింగ్ జరిగేలా చూడాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అదనపు కమిషనర్, శిక్షణ నోడల్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్  తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రెండో విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ బుధవారం నిర్వహించారు. ఇందులో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రంజిత్ కుమార్, పోలీస్ అబ్జర్వర్ ఓం ప్రకాశ్ త్రిపాఠీ, వ్యయ పరిశీలకుడు సంజీవ్ కుమార్ లాల్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల ఏజెంట్లు పాల్లొన్నారు. ఈ ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను కేటాయించనున్నారు. పోలింగ్​కు ముందు చివరగా మరో విడత ర్యాండమైజేషన్ జరగనుంది.