పూణేలో 16.4 ఎకరాల భూమిని కొన్న మైక్రోసాఫ్ట్

పూణేలో 16.4 ఎకరాల భూమిని కొన్న మైక్రోసాఫ్ట్

న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ పూణేలో 16.4 ఎకరాల భూమిని రూ. 520 కోట్లకు కొనుగోలు చేసిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ స్క్వేర్ యార్డ్స్ తెలిపింది.    పూణేలోని హింజేవాడిలో 66,414.5 చదరపు మీటర్ల భూమిని కొనుగోలు చేసింది. ఆగస్టు 2024లో ఇండో గ్లోబల్ ఇన్ఫోటెక్ సిటీ నుంచి భూమిని కొన్నది. 

 ఈ డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్టాంప్ డ్యూటీ రూ.31.18 కోట్లు కాగా, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30 వేలు.  మైక్రోసాఫ్ట్ ఈ ఒప్పందంపై స్పందించలేదు. ఇదే కంపెనీ  2022లో పింప్రి-చించ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 25 ఎకరాల స్థలాన్ని రూ.328 కోట్లకు కొనుగోలు చేసింది.  ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 48 ఎకరాల భూమిని రూ.267 కోట్లకు దక్కించుకుంది. 
 

మరిన్ని వార్తలు