317 మంది స్కూలు పిల్లల్ని కిడ్నాప్ చేసిన మిలిటెంట్లు

317 మంది స్కూలు పిల్లల్ని కిడ్నాప్ చేసిన మిలిటెంట్లు
  • నైజీరియాలో 317 మంది స్కూలు పిల్లల కిడ్నాప్
  • అర్ధరాత్రి స్కూల్​పై మిలిటెంట్ల దాడి

అబుజా (నైజీరియా): నైజీరియాలో ఓ స్కూల్ పై దాడి చేసిన మిలిటెంట్లు 317 మంది పిల్లలను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. జమ్ఫారా స్టేట్​లోని జంగెబె టౌన్​లో ఈ ఘటన జరిగింది. గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్​పై అర్ధరాత్రి గుర్తుతెలియని గన్ మెన్లు దాడి చేసి పిల్లలను కిడ్నాప్ చేశారని స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ చెప్పారు. వారంలో ఇది రెండో కిడ్నాప్ ఘటన అని తెలిపారు. పిల్లల ఆచూకీ కోసం సెక్యూరిటీ బలగాలు గాలిస్తున్నట్టు వెల్లడించారు. ‘అర్ధరాత్రి మిలిటెంట్లు స్కూల్​పై దాడి చేశారు. పిల్లలను బలవంతంగా వెహికల్స్​లోకి ఎక్కించారు. మరికొందరు పిల్లలను నడిపించుకుంటూ తీసుకెళ్లారు’ అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొందరు గవర్నమెంట్ సెక్యూరిటీ ఫోర్సెస్ యూనిఫాంలో ఉన్నట్టు స్కూల్ టీచర్ ఒకరు చెప్పారు. స్కూల్​లో మొత్తం 421 మంది స్టూడెంట్స్ ఉంటే.. కిడ్నాప్ తర్వాత 55 మంది మిగిలారని తెలిపారు. కిడ్నాప్ విషయం తెలుసుకున్న పేరెంట్స్ స్కూల్ దగ్గరకు చేరుకుని.. తమ పిల్లలను కాపాడాలని డిమాండ్ చేశారు.