టర్కీలో ఘోర ప్రమదం జరిగింది. బిట్లీస్ ప్రావిన్స్ లోని పర్వత ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో లెఫ్టినెంట్ జనరల్ ఉస్మాన్ ఎర్బాస్ ఉన్నారు. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. దట్టమైన పొగమంచు కమ్ముకుపోవడంతోనే ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. లెఫ్టినెంట్ జనరల్ ఉస్మాన్ ఎర్బాస్ మృతి పట్ల ఆ దేశ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోకాన్ సంతాపం తెలిపారు.

