భిక్షమెత్తుతూ ఐదు బిల్డింగులు, రూ.కోటికి పైగా సంపాదన

భిక్షమెత్తుతూ ఐదు బిల్డింగులు, రూ.కోటికి పైగా సంపాదన

కైరో: భిక్షాటనతో పొట్ట నింపుకునే వారిని చూసుంటాం. బెగ్గింగ్‌‌ను మాఫియాగా మార్చి డబ్బులు సంపాదించిన వారినీ చూసుంటాం. కానీ ఈజిప్టులో ఓ మహిళ భిక్షాటనతో ఏకంగా కోట్లు గడించింది. తనకు లేని అంగ వైకల్యాన్ని ఉన్నట్లు నటిస్తూ కోట్లు గడించి చివరకు కటకటాలపాలైంది. 57 ఏళ్ల సదరు మహిళ పేరు నఫీసా. ఆమె పేరిట ఈజిప్టులో ఐదు బిల్డింగులతోపాటు బ్యాంక్ ఖాతాలో రూ.1.4 కోట్లు నగదు ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు.

బెగ్గింగ్ కోసం నఫీసా వీల్‌‌చైర్‌లో ఉన్నట్లు నటించింది. కానీ ఆమెను నిశితంగా గమనించిన ఓ వ్యక్తి నఫీసాకు ఎలాంటి వైకల్యం లేదని, ఆమె బాగా నడుస్తోందని చెప్పడంతో మోసం బయటపడింది. దీంతో నఫీసాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నఫీసా కాళ్లకు ఎలాంటి ప్రమాదం కాలేదని, ఆమె కాళ్లు చచ్చుబడలేదని పోలీసుల రిపోర్టులో తేలింది. విచారణలో భాగంగా నఫీసాను త్వరలో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.