జగన్‌ పిలిస్తే ఏపీలో ప్రచారం: అసద్‌

జగన్‌ పిలిస్తే ఏపీలో ప్రచారం: అసద్‌

హైదరాబాద్‌, వెలుగు: ‘రాష్ట్రంలో టీఆర్‌ఎస్ తో కలసి ఎన్ని కలకు వెళ్తాం . ఇక్కడ టీఆర్‌ఎస్‌ 16 సీట్లు, ఎంఐఎం ఒక సీటు గెలుస్తుంది. విపక్షాలు ఒక్క స్థానం కూడా గెలవవు’ అని MIM అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ జోస్యం చెప్పారు . ఆదివారం హైదరాబాద్ లో స్టూ డెంట్లతో అసద్‌ ముఖాముఖిగా మాట్లాడారు. ‘ఏపీలో వైఎస్సార్ సీపీ 20–21 లోక్ సభ స్థా నాలు గెలుస్తుంది. అక్కడ ప్రచారం చేయాలని జగన్‌ పిలిస్తే వెళ్తా ’నన్నారు . కొంతమంది పెళ్లి చేసుకోకుండా త్యాగం చేస్తున్నామని చెప్పుకుంటున్నారని, రాజకీయాల్లో అది చెల్లదన్నారు . ప్రజాస్వామ్యం లో

ప్రజాసేవ చేస్తూ ప్రజల్లో ఉండాలని, అప్పుడే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో పోటీకి వయోపరిమితిని 20 ఏళ్లు చేయాలంటూ ప్రైవేట్‌ బిల్లు పెట్టానని, కానీ అది పాస్‌ కాలేదని అసద్‌ చెప్పారు .